మా ప్రాజెక్ట్‌లలో కొన్ని

ఇతరులకు సహాయం చేయడమే మా లక్ష్యం. రెండు విధాలుగా అనగా మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా సహాయము చేయడమే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు సహాయం చేయడం మరియు స్థానిక పాఠశాల విద్య, వైద్యం మరియు సంరక్షణ అనే ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడంపైన మా దృష్టి ఉంటుంది. ఈ పేజీలో మీరు మా తాజా ప్రాజెక్ట్‌లలో కొన్నింటిని కనుగొనవచ్చు.

ఇంటర్నెట్ ప్రాజెక్ట్ Alwjud.com

మా ఇంటర్నెట్ ప్రాజెక్ట్ AlWujud.com ద్వారా మేము ప్రజలు జీవితంలో వారి లక్ష్యాన్ని కనుగొనడంలో సహాయం చేయాలనుకుంటున్నాము మరియు సందర్శకులు ఆధ్యాత్మికంగా కూడా ఎదగడానికి మేము మద్దతు ఇస్తాము. ఈ వెబ్‌సైట్‌ను విస్తరించేందుకు మా బృందం ఎంతో తీవ్రంగా కృషి చేస్తోంది మరియు వెబ్‌సైట్‌ను 10 నుండి 20 భాషల్లో అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం. మేము ఇప్పటికే అనువాదాలు మరియు వెబ్‌సైట్ అభివృద్ధి చేసేందుకు దాతల కోసం చూస్తున్నాము. ప్రాజెక్ట్ కోడ్ ALWUJUD

blank

స్థానిక ప్రాజెక్టులు

మేము ప్రపంచ వ్యాప్తముగా అనేక స్థానిక ప్రాజెక్ట్లకు సహాయం చేస్తాము. ఈ ప్రాజెక్ట్‌లు అన్నీ వివిధ విధానాలను కలిగి ఉన్నాయి, అయితే అవన్నీ ఇతర వ్యక్తులకు మెరుగైన జీవితాన్ని అందించడంలో సహాయపడటానికి దృష్టి సారించాయి.

దాదాపు అన్ని ప్రాజెక్ట్‌లు చిన్న పరిమాణంలోనె ఉంటాయి మరియు స్థానిక భాగస్వాములచే సమన్వయం చేయబడతాయి. మేము ప్రాజెక్ట్ యొక్క ఏకైక సహాయక భాగస్వామిగా ఉండకూడదనుకుంటున్నాము. ఫలితంగా, ఒక ప్రాజెక్ట్ ఒకే దాతపైనే పూర్తిగా ఆధారపడి ఉండదు. దీని అర్థం అదనంగా వివిధ కోణాల నుండి ప్రాజెక్ట్‌ల యొక్క విస్తృత పర్యవేక్షణ ఉంటుంది.

మేము చిన్న తరహా ప్రాజెక్టులకు మాత్రమే మద్దతిస్తాము కాబట్టి, కొంచం వ్యయముతో కూడినది. మా కార్యాలయంలో ఉచితముగా పనిచేసే వాలంటీర్లు మాత్రమే ఉన్నారు, మరియు కార్యాలయ ఖర్చులను (మా బడ్జెట్‌లో 5% కంటే తక్కువ) మినహాయించిన తర్వాత, బడ్జెట్ లో మిగతాదంత ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది.

మేము మద్దతిచ్చే అనేక ప్రాజెక్ట్‌ల సంక్షిప్త సారాంశం క్రింద ఉంది.

చిల్డ్రన్స్ హోమ్ మరియు వర్క్ ప్రాజెక్ట్ నైరోబి

నైరోబీలో మేము వెనుకబడిన యువకుల కోసం విద్య మరియు ఆచరణాత్మకమైన శిక్షణను అందించే యూరోపియన్ వాలంటీర్ల బృందానికి మద్దతునిస్తాము. ఇది నిరాశ్రయులైన యువకులకు మంచి భవిష్యత్తును అభివృద్ధి చేసుకోవడానికి అందించ బడుతుంది . ప్రాజెక్ట్ కోడ్ NA01

లెప్రసీ ప్రాజెక్ట్ ఇండోర్ ఇండియా

భారతదేశం వంటి దేశాల్లో ఇప్పటికీ కుష్టువ్యాధి పెద్ద ఎత్తున సంభవిస్తుంది. తరచుగా కుష్ఠురోగుల కాలనీలకు బహిష్కరించబడే రోగులు అనిశ్చిత భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారు. కుష్టు వ్యాధిగ్రస్తుల సంరక్షణ కోసం మేము బహుళ స్థానిక సంస్థలకు మద్దతు ఇస్తున్నాము. ఈ స్థానిక సంస్థల వాలంటీర్లు రోగులకు వైద్య మరియు మానసిక సహాయాన్ని అందిస్తారు. ప్రాజెక్ట్ కోడ్ IN08

ఆత్మహత్య నివారణ కౌన్సెలింగ్ చెన్నై ఇండియా

చెన్నై (భారతదేశం)లో ఆత్మహత్య ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తులకు ప్రథమ చికిత్స అందించే స్థానిక సంస్థ యొక్క పనికి మేము మద్దతు ఇస్తున్నాము. ప్రత్యేక టెలిఫోన్ నంబర్ ద్వారా, అవసరమైన వ్యక్తులకు 24 గంటలూ తక్షణ సహాయం అందించవచ్చు. ఈ విధంగా ఇప్పటికే అనేక ఆత్మహత్యలు అరికట్టబడ్డాయి.

తరచుగా పరిస్థితి నిరాశాజనకంగా కనిపిస్తుంది మరియు మంచి సంభాషణ ద్వారా భవిష్యత్తుపై ఆశ కోల్పోయిన వ్యక్తులకు ఆశను అందిస్తుంది. ప్రాజెక్ట్ కోడ్ IN10

విద్యా ప్రాజెక్టులు

మేము ఆసియా, ఆఫ్రికా మరియు అమెరికాలోని వివిధ దేశాలలో చిన్న తరహా విద్యా ప్రాజెక్టులకు మద్దతు ఇస్తున్నాము. ఈ 1 లేదా అనేక -సంవత్సరాల శిక్షణా కోర్సుల సమయంలో, విద్యార్థులు శిక్షణ పొందుతారు మరియు మెరుగైన భవిష్యత్తులోకి ప్రవేశించడానికి విలువైన జ్ఞానం మరియు అనుభవాన్ని నేర్చుకుంటారు. స్థానిక నివాసులతో జ్ఞానం మరియు అనుభవాన్ని పంచుకోవడం కూడా ఈ కోర్సులలో ముఖ్యమైన భాగం. మయన్మార్ ప్రాజెక్ట్ కోడ్ MM01; పాకిస్తాన్ ప్రాజెక్ట్ కోడ్ PA03

పిల్లల గృహాలు

మేము ఆసియా మరియు ఆఫ్రికా మరియు ఇతర ఖండాలలోని పిల్లల గృహాలకు సహాయం చేస్తాము. చాలా దేశాల్లో అనేక మంది పిల్లలు వీధిలో నివసిస్తున్నారు. కొన్నిసార్లు వారి తల్లిదండ్రులు పేదవారై నందున వారిపిల్లలను జాగ్రత్తగా చూసుకోలేరు . లేదా తల్లిదండ్రులు మద్యపానం లేదా మాధకద్రవ్యాలు తీసుకుంటారు. సాధారణంగా వారు తమ కష్టాలను మరచిపోవడానికి ఈ మందులను ఉపయోగిస్తారు. పిల్లలు ఈ పరిస్థితికి బాధితులు మరియు వీధిలోనె అక్కడ వారు తరచుగా డ్రగ్స్ మరియు మద్యంలో మునిగి తేలతారు. అదృష్టవశాత్తూ అనేక నగరాల్లో ఈ పిల్లలను చూసుకునే వాలంటీర్లు ఉన్నారు మరియు వారు అలాంటి పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి ప్రయత్నిస్తారు. విద్య, ఆహారం మరియు వారిమీద చూపించే శ్రద్ధ ద్వారా ఈ పిల్లలు తమ జీవితాలను మార్చుకునే అవకాశాన్ని పొందుతారు. నేపాల్ ప్రాజెక్ట్ కోడ్ NE07, ET02 చిల్డ్రన్స్ హోమ్ ఇథియోపియా, బొలీవియా ప్రాజెక్ట్ కోడ్ BO01

డేకేర్ సెంటర్ చెన్నై ఇండియా

భారతదేశంలోని చెన్నైలో, మేము చిన్న (వీధి) పిల్లల కోసం డే కేర్‌ సెంటర్ మద్దతు ఇస్తున్నాము. డేకేర్ సమయంలో వారు శిక్షణ, ఆహారం మరియు పరిశుభ్రత, నిబంధనలు మరియు విలువలు వంటి ఆచరణాత్మక విషయాల గురించి పాఠాలను అందుకుంటారు. ప్రాజెక్ట్ కోడ్ IN12

విపత్తులో ఉపశమనం

భారతదేశం మరియు బంగ్లాదేశ్ వంటి దేశాలలో వరదలు క్రమం తప్పకుండా సంభవిస్తాయి. మేము ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక పరిచయాలను కలిగి ఉండి , మేము వారికి మద్దతునిస్తాము, తద్వారా వారు అత్యవసర సహాయ ప్యాకేజీలను కొనుగోలు చేయవచ్చు మరియు అందజేయవచ్చు. తరచుగా వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి ఉంటుంది మరియు వారు సర్వం కోల్పోతారు. కొన్ని ఆహారం మరియు దుప్పట్లతో సహా అత్యవసర సహాయ ప్యాకేజీ మొదటి ఎమర్జెన్సీకి సహాయపడుతుంది. ప్రాజెక్ట్ కోడ్ IC01

విద్యార్థి శిక్షణ నెదర్లాండ్స్

నెదర్లాండ్స్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో, విద్యార్థులు తమ సబ్జెక్ట్‌ను మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక విషయాల గురించి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కూడా ఆహ్వానించబడ్డారు. విద్యార్థులు మరియు కోచ్‌ల మధ్య ఉమ్మడి సమావేశాల సమయంలో, జ్ఞానం భాగస్వామ్యం చేయబడుతుంది మరియు జీవిత అభిప్రాయాలు మార్పిడి చేయబడతాయి. ప్రాజెక్ట్ కోడ్ NL05

శరణార్డులకు సహాయం

శరణార్థులకు సహాయం మరియు ప్రథమ చికిత్స. యుద్ధ పరిస్థితులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల కారణంగా వారి స్వంత దేశం నుండి పారిపోవాల్సిన శరణార్థులకు పరిస్థితులను బట్టి మేము సహాయాన్ని అందిస్తాము. సహాయంలో ఆహార పంపిణీ, వైద్య సహాయం లేదా గాయాల కట్టుటకు సహాయం ఉండవచ్చు. ప్రాజెక్ట్ కోడ్ REF01

ఇతర ప్రాజెక్టులు

మేము అనేక ఇతర ప్రాజెక్ట్‌లు అన్ని ఖండాలలోని వ్యక్తులకు మద్దతునిస్తాము. మా అన్ని పరిచయాల గోప్యత మరియు భద్రత కారణంగా మేము మా వెబ్‌సైట్‌లో పేర్లు లేదా చిరునామాలను పేర్కొనము. మీరు ప్రాజెక్ట్ గురించి మరింత సమాచారం కావాలనుకుంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

మీరు కూడా సహాయం చేయాలనుకుంటున్నారా?

మీరు కూడా పైన పేర్కొన్న ప్రాజెక్ట్‌లలో ఒకదానిలో లేదా ఇతర ప్రాజెక్ట్‌లలో పాల్గొంటే చాలా బాగుంటుంది. మీరు ప్రాజెక్ట్‌కు మద్దతు ఇవ్వాలనుకుంటే, దయచేసి మా విరాళం పేజీని చూడండి లేదా ఇమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి: donate@alwujud.com

.

కుష్టురోగులకు సహాయం
ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్
వరద సహయం