మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి

గౌరవించబడకపోవడం చాలా అవమానకరమైనది మరియు బాధాకరమైనది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది మరియు ఇతర వ్యక్తుల పట్ల మీ వైఖరిని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. మనము దీనిని తరచుగా పిల్లలలో బెదిరింపుగా సూచిస్తాము, కానీ పెద్దలు కూడా ఒకరి జీవితాన్ని వివిధ మార్గాల్లో దుర్భరపరుస్తారు.

అన్ని సంస్కృతులలో బెదిరింపు అనేది ఉంది దానివలన ప్రజలు అణచివేయబడ్డారు. స్పష్టంగా ఇది ప్రజలకు అవసరమైన తెలుసుకోవాలిసిన విషయం. కొన్నిసార్లు ఇది వేధించే వ్యక్తి మరియు బాధితుడి మధ్య ఉంటుంది, కానీ దాదాపు ప్రతిచోటా మొత్తం వ్యక్తుల సమూహాలు తక్కువగా పరిగణించబడతాయి. తరచుగా వారు వేరే మూలం, రంగు , లింగం లేదా మతాన్ని కలిగి ఉంటారు.

ఈ ప్రవర్తన ఒక వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసానికి ప్రధాన పరిణామాలను కలిగిస్తుంది. ఇది అభద్రత, నిరాశ, వైఫల్యం భయం, సర్దుబాటు సమస్యలు మరియు ఒంటరితనం దారితీస్తుంది. ఇతరులను వేధించే లేదా తక్కువవారిగా ప్రవర్తించే వ్యక్తికి అతని లేదా ఆమె ప్రవర్తన యొక్క పరిణామాల గురించి తరచుగా తగినంత అవగాహన ఉండదు.

ఇంటర్నెట్ వచ్చినప్పటి నుండి, బెదిరింపు మరియు ఇతరులను అణచివేయడం సులభం అయింది. వేధించే వ్యక్తి బాధితురాలిని నేరుగా చూడవలిసిన అవసరం లేదు, అందువల్ల అతను లేదా ఆమె వేరొకరి గురించి మాట్లాడే విషయంలో అడ్డు లేదు. ఇది కొన్నిసార్లు బాధితులు ఆత్మహత్య చేసుకోవడానికి భయానక పరిణామాలను కలిగిస్తుంది.

మనం ఇతరులను ఎందుకు చిన్నచూపు చూస్తాము?

ప్రజలు ఒకరినొకరు ఎందుకు హింసించుకుంటారు? అంటే కొన్నిసార్లు విసుగు చెందడం వలన, మరియు సాధారణంగా భయం, నిరాశ లేదా అసూయతో కూడా వలన ఉంటుంది. విసుగు చెందినప్పుడు ఒక సాదారణమైన బాధితుడు తరచుగా ఈ విధమైనది కోరుకుంటాడు. అసూయ అనేది ఒక నిర్దిష్ట వ్యక్తిని లక్ష్యంగా చేసుకుంటుంది. భయం, అమాయకత్వం లేదా అభద్రతా భావం నుండి ఉత్పన్నమవుతుంది మరియు తరచుగా వివక్ష మరియు వర్గ అసమానతలకు కూడా కారణం కావచ్చు.

వారి కఠినమైన ప్రవర్తన ఉన్నప్పటికీ, బెదిరింపులు తరచుగా బద్రత లేనివారుగా ఉంటారు మరియు వారి ప్రవర్తన ద్వారా దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. అనుచరులు భయంతో రౌడీ ప్రవర్తనలో పాల్గొంటారు కాబట్టి, రౌడీజం కొనసాగించడానికి ఇది నిర్ధారణ.

బెదిరింపు గురించి ఆలోచించినప్పుడు, పాఠశాలలో లేదా బయట వేధింపులకు గురైన పిల్లల గురించి మనం తరచుగా ఆలోచిస్తాము. కానీ ఇది పెద్దల రోజువారీ జీవితంలో కూడా సంభవిస్తుంది. మేము దానినిగుణుగుడు , వివక్ష, ఒకరిని విస్మరించడం లేదా అధికార దుర్వినియోగం మరియు బెదిరింపు అని కూడా పిలుస్తాము.

నివారణ

పాఠశాల యాజమాన్యం లేదా యజమాని జోక్యం చేసుకుంటే పాఠశాలలో లేదా కార్యాలయంలో బెదిరింపును నిరోధించవచ్చు. అయితే ఇది అన్ని సందర్భాల్లోనూ జరగదు. బెదిరింపు లేదా అసమానత అనేది సమాజంలో ‘సాధారణం’గా కనిపించినప్పుడు ఇది మరింత కష్టమవుతుంది. కొంతమంది వ్యక్తులు వారి మూలం కారణంగా ఇతర వ్యక్తుల కంటే తక్కువ స్థితిని లేదా భిన్నమైన రంగును కలిగి ఉంటారు.

మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు?

మీరు బెదిరింపులకు గురై మీ స్థాయి తక్కువ చేయబడినప్పుడు అది చాలా బాధాకరంగా ఉంటుంది. దాని ప్రభావాలతో మీరు మీ జీవితాంతం బాధపడవచ్చు, ఇతర వ్యక్తులు మీకు ఆ అభిప్రాయాన్ని అందించాలనుకున్నా కూడా ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి కంటే ముఖ్యమైనవారేం  కాదని మీరు తెలుసుకోవాలి.

ఒకరి కంటే ఒకరికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది. కానీ మొదటి చూపులోనే ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తులు కూడా వాస్తవానికి ఎప్పుడు సందేహం మరియు అభద్రతా భావాలను కలిగి ఉంటారు. గొప్ప ప్రతిభావంతులు మరియు అత్యంత విజయవంతమైన వ్యక్తులు కూడా తరచుగా అబధ్రతా భావం కలిగి ఉంటారు. కొన్నిసార్లు దానిని వారు మరొకరికి నష్టం కలిగించే విధంగా వ్యక్తపరుస్తారు. దీనిని కొన్నిసార్లు చాలా స్పష్టంగా మరియు కొన్నిసార్లు మీరు గమనించకుండా జరుగుతుంది.

మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు అనేది ఎక్కువగా మీ ఇష్టం!మీ గురించి మీరు ఆలోచించే విధానం వాస్తవానికి సరిపోవడం చాలా అరుదు. ఫలితంగా, మీరు మీ గురించి మరింత ప్రతికూల చిత్రాన్ని కలిగి ఉండవచ్చు.

 ఇతరులతో మీరు ఏలా ప్రవర్తిస్తారో ఆలోచించడానికి కూడా ప్రయత్నించండి. మీరు ఒకరి గురించి సణగడం లేదా కొన్నిసార్లు ఒకరిని తక్కువగా చూడటం కూడా ఇష్టపడవచ్చు.

అనిశ్చితికి కారణాలు

అనిశ్చితి వివిధ మార్గాల్లో తలెత్తవచ్చు. ఇది తరచుగా జీవితంలో ప్రారంభం నుండే మొదలవుతుంది. మీరు గతంలో చాలా తక్కువ చేయబడడం గమనించినట్లయితే  లేదా మీరు గతంలో బెదిరింపులకు గురైనట్లయితే, ఇది మిమ్మల్ని అబద్రతకు గురి చేస్తుంది. మీరు తక్కువ చేయబడిన లేదా ఇతరులు మిమ్మల్ని తరచుగా విమర్శించినా, మీకు ఆధిపత్యం చెలాయించే తల్లిదండ్రులు లేదా చాలా అతిజాగ్రత్తగా చూసుకొనే  తల్లిదండ్రులు ఉన్నగాని ఫలితంగా మీరు అబద్రతకు గురికావచ్చు . అయినప్పటికీ మీరు ఒకసారి మీకు నేర్పించినట్లుగానే మీ గురించి ప్రతికూలంగా ఆలోచించడం ద్వారా మీ అభద్రతను మీరు కొనసాగిస్తారు.

అనిశ్చితి గురించి మీరు ఏమి చేయవచ్చు

మీరు పనులను సరిగ్గా చేయడానికి ఇష్టపడే వ్యక్తి అయితే, మీరు మీ గురించి మీకు బాగా తెలియని అనేక విషయాలను పేర్కొనవచ్చు. మిమ్మల్ని మీరు ఎంత విమర్శించుకుంటున్నారో ఒకసారి చూడండి. మీరు బాగా చేసే కొన్ని పాయింట్లను కూడా జాబితా ( లిస్ట్) చేయండి.

మీ లక్ష్యాలను మరింత సాధించగలిగేలా చేయడానికి ప్రయత్నించండి, బహుశా వాటిని చిన్న దశలుగా విభజించడం ద్వారా. మీరు ఒక దశను పూర్తి చేసినప్పుడు మీరే మెచ్చుకోండి. వాటిలో మంచివాటికి పేరు పెట్టండి,మరియు ఇతరుల నుండి వచ్చే పొగడ్తలను కూడా అంగీకరించండి. మీరు బాగా చేయగలరని లేదా మీరు బాగా చేస్తారని ఇతరులు చెప్పే వాటిలో కొన్నింటిని మీ కోసం వ్రాసుకోండి. మీరు ఇటీవల సాధించిన విషయాల కోసం మిమ్మల్ని మీరు మెచ్చుకోండి.

దేని గురించి మీరు భయపడుతున్నారు? మీరు ఏదైనా చేయాలనుకుంటే దానిలో విఫలమవుతారని మీరు భయపడుతున్నారా? మరియు అది జరిగేది ఏమిటి? ఏది తప్పు కావచ్చు అది తప్పు అయ్యే అవకాశం ఎంత వరకు ఉన్నది? మరియు వాస్తవానికి అది ఎంత చెడ్డది అని మీరే పేరు పెట్టండి. అన్నింటికంటే ఎదురుదెబ్బలు మరియు నిరాశలు జీవితంలో భాగం. ప్రతిదీ సరిగ్గా జరగదు మరియు మనం ప్రతిదానిలో మంచిగా ఉండలేము. అలాగే, మనం ఎప్పుడూ రిలాక్స్‌గా, నమ్మకంగా, సంతోషంగా ఉండలేము.

ఇతర విషయాలలో నైపుణ్యం ఉన్న ఇతర వ్యక్తులతో మిమ్మల్ని మీరు పోల్చుకోకుండా ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి వారి స్వంత లక్షణాలు ఉన్నాయి, కాబట్టి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

సానుకూల మరియు విలువైన భవిష్యత్తుకు అడుగులు

 మీ గురించి మీరు ప్రతికూలంగా ఆలోచిస్తూనే ఉన్నంత కాలం మీరు మీ అభద్రతను పెంచుతూనే ఉంటారు.  ఇతర మానవులలాగానే మీరు ముఖ్యమైనవారే. మీరు భిన్నంగా కనిపించినప్పటికీ, మీరు దేనిలోనూ రాణించకపోయినప్పటికి, మీరు ఒక కుటుంబంలో భాగమైనప్పటికీ, అది ఉన్నత స్థితిని కలిగి ఉండకపోవచ్చు. మీరు ప్రకృతి లోపం కాదు, మీరు జీవించడానికి ఒక కారణం ఉంది!

మీరు నిజంగా ఎందుకు విలువైనవారో కనుగొనడంలో నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. జీవితంలో నిజంగా ఏది ముఖ్యమైనదో నేను స్వయంగా కనుగొనగలిగాను మరియు దానిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆవిష్కరణ యాత్రలో మీరు నాతో చేరుతారా?

.