కుష్టురోగులకు సహాయం

భారతదేశంలోని అనేక నగరాల్లో మేము లెప్రసీ కేర్ ప్రాజెక్ట్‌లకు మద్దతు ఇస్తున్నాము. దానిని మా స్థానిక భాగస్వాములు చూసుకుంటున్నారు, కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులలో ఒకరి గురించి మేము ఈ చిన్న కథనాన్ని పంచుకోవాలనుకుంటున్నాము;

blank

తగడిబీ (65) అనే మహిళ దాదాపు 30 ఏళ్లుగా కుష్టు వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు ఉన్న ఆ కుష్టు వ్యాధిని బట్టి ఆమె యొక్క కుటుంబసభ్యులు ఆమెను తిరస్కరించారు, అప్పుడు ఆమె తన ఇంటి నుండి బహిష్కరించబడింది.

తగడిబి నిరాశ్రయురాలై వీధిలో భిక్షాటన చేస్తూ సుమారు 8 సం.లు గడిపింది. అయితే ఇటీవల కొంతమంది స్నేహితులు ఆమె పరిస్థితిని మా బృందానికి తెలియజేశారు.

ఆ సమయంలో తగడిబి ని చూసినప్పుడు ఆమె పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది. మాకు పరిచయం చేసిన స్నేహితులు ఆమెను జాగ్రత్తగా చూసుకోగలరా? అని మమ్ములను అడిగి లేకుంటే ఆమె త్వరలో చనీ పోతుంది అని మాకు తెలియజేసినప్పుడు మేము ఆమెను మా కుష్టురోగులును పరామర్శించే కేంద్రానికి తీసుకువచ్చాము, అక్కడ ఆమె రోజువారీ వైద్య సంరక్షణ పొందుతూ ఆమెకు కావలిసిన ఆహారం, మరియు ఆశ్రయము పొందుతూ సంరక్షణలో ఉంది.

ప్రేమగల సంరక్షణ గృహం (లవింగ్ కేర్ హౌస్)

భారతదేశంలో కుష్టు వ్యాధితో బాధపడుతున్న వృద్ధులను తరచుగా వారి స్వంత కుటుంబాల నుండి బహిష్కరిస్తారు, మరియు ఈ కుష్టు వ్యాధి ఇతర కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేస్తుందనే భయంతో వీధుల్లో కూడా నిర్లక్ష్యం చేయబడతారు, తగడిబాయి వంటి కుష్టువ్యాధితో బాధపడుతున్న వృద్ధులను వైద్యపరంగానూ, మానసికంగానూ ఆదుకునే గృహామిది, దీని పేరే ‘లవింగ్ కేర్ హౌస్’.

blank

మీరు ఈ ప్రాజెక్ట్‌కి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా? మరింత సమాచారం కోసం దయచేసి మా విరాళం పేజీని సందర్శించండి;

blank

భారతదేశంలోని చెన్నైనగరంలో ఉన్న మా బృందం నుండి: మేరీ అనే కుష్టువ్యాధిగ్రస్తురాలు ఉండేది, వ్యాధి కారణంగా ఆమె కాలు మరియు వేళ్లను కోల్పోయింది , ఆమెకై ఆమె ఏమీ చేసుకోలేదు, ఆమె జీవితం ఇతరుల సహాయం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, ఆమె పరిస్తితి చాలా దారుణంగా ఉంది. మేరీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నప్పటికీ, వారు తమ తల్లిని చూసుకోవడం లేదు, అందుకే మేరీని చూసుకోవడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసాము. మేము ఆమెకు ఆహార సామాగ్రి మరియు( వైద్యం)మందులు సహాయం చేసాము, ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది.

.

కుష్టురోగులకు సహాయం
ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్
వరద సహయం