వరద సహయం
వర్షాకాలంలో భారీ వర్షాలు కారణంగా భారతదేశం తరచుగా వరదలకు గురవుతుంది, నదులు, పరిసర ప్రాంతాలు తరచుగా దీనికి సిద్ధంగా ఉండవు కావున డజన్ల కొద్దీ గ్రామాలను నాశనం అవుతాయి.
.1924లో సంభవించిన భారీ వరదల మాదిరిగానే 2018లో కేరళలో భారీ వరదలు వచ్చాయి ఈ వరదలు గత 100 ఏళ్లలో ఎప్పుడు లేని విదముగా వర్ణించబడ్డాయి. ఈ వరదలు అక్కడ ఉన్న కొండచరియలు అనేక గృహాలను మరియు వ్యవసాయ భూముల్లోని పెద్ద ప్రాంతాలను ముంచెత్తాయి. అనేక కొండచరియలు విరిగిపడటం వల్ల అత్యధిక సంఖ్యలో375 మందికి పైగా ప్రజలు మరణించారు.
1.2 మిలియన్ల మంది ప్రజలు తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్నట్లు అంచనా. అక్కడ ఆశ్రయాల్లో నీరు మరియు వైద్య సదుపాయాల కొరత కారణంగా అదనపు సమస్యలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా ఉండడం కూడా ఇందుకు కారణమైంది. చాలా చోట్ల చిన్నపిల్లలను మరియు వృద్ధులు సురక్షితంగా తీసుకొని రాబడ్డారు, అతి పెద్ద ఆర్థిక నష్టం వచ్చింది, దాదాపు USD 3 బిలియన్లకు పైగా ఉంటుందని అంచనా వేయబడింది.
సహాయ శిబిరం
విపరీతమైన వరదలు వచ్చి ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఇండ్లు నీట మునిగీపోయాయి ప్రజలు నిస్సహాయులయ్యారు, నిరాశకు గురైన ప్రజలు ఆశ్రయం పొందుటకు శిబిరాల కోసం చూశారు.అక్కడ ఉన్న శిబిరాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఆ సమయంలో మా స్థానిక భాగస్వాములు ఒక చిన్న శిబిరాన్ని ఏర్పాటుచేశారు, దానిని ప్రభుత్వం కూడా సహాయక శిబిరంగా ఉపయోగించవచ్చు.
ఈ చిన్న శిబిరంలో 130 మందికి పైగా నివసిస్తున్నారు. మా స్థానిక భాగస్వాములు శరణార్థుల కోసం రోజుకు 3 పూటలు భోజనం వండి పెడుతూ దుస్తులు, నీరు, మందులు మరియు ఇతర అవసరాలను తీరుస్తూవచ్చారు. నిరాశ్రయులైన ఈ ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్లగలిగినప్పుడు, వారు తమ ఇళ్లను పునర్నిర్మించుకోడానికి అవసరమైన సామగ్రిని మా బృందం వారికి అందించింది. అంతమాత్రమే కాకుండా వారికి ఆహారం, బట్టలు, పరుపులు, దుప్పట్లు కూడా పంపిణీ చేశారు.
దాదాపు 300 కుటుంబాలకు సహాయ చేశారు
మా వాలంటీర్ల బృందం అనేక ఇతర వాలంటీర్లకు కూడా శిక్షణ ఇచ్చింది కాబట్టి వారు అవసరమైన అన్ని పనులను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు.
- నీటమునిగిన 22 కుటుంబాలకు పూర్తిగా వారి ఇళ్లను తొలగించేందుకు ఈ బృందం సహాయం చేసింది.
- వరదల కారణంగా పలు ఇళ్లు పాక్షికంగా, మరికొన్ని పూర్తిగా ధ్వంసమయ్యాయి. పాక్షికంగా దెబ్బతిన్న 10 ఇళ్లను బాగు చేసేందుకు బృందం సహాయం చేసింది.
- వరద ప్రభావం తగ్గిన తర్వాత, మా బృందం వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కుటుంబాలకు ఆహారం, పరుపులు, దుప్పట్లు, తాగునీరు, మందులు, బట్టలు, దుప్పట్లు మరియు ఇతర అవసరమైన వస్తువులతో సహాయం చేసింది.
వరదలు మరియు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, తమ తోటి దేశస్థులకు సహాయం చేయడానికి చాలా మంది వాలంటీర్లు త్వరగా ముందుకు వస్తారు. భారతదేశంలోని మా భాగస్వామ్య సంస్థ YWAM ద్వారా, ఆహారం, దుప్పట్లు మరియు నిర్మాణ సామగ్రి వంటి సహాయక సామగ్రిని కొనుగోలు చేయుటకు మేము మా వాలంటీర్లకు క్రమం తప్పకుండా సహాయం చేస్తాము.
మీరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్‌లకు సహాయం చేయాలి అనుకుంటే? మరిన్ని వివరాల కోసం మా విరాళం పేజీని సందర్శించండి;
.