మీరు మీ జీవితంతో సంతృప్తిగా ఉన్నారా?

మీ జీవితం అసంతృప్తిగా  ఉన్నదా? మీరు సంతోషంగా కనబడుతున్నప్పటికి కూడా, జీవితంలో ఇంకా ఏదో అసంతృప్తి.

ఆనందం అనేది స్వల్పకాలిక అనుభూతి, కానీ సంతృప్తి అనేది మీ జీవితమంతటికి సంబంధించినది. మీరు మరింత సంతృప్తి చెందడం కొరకు నేను మీకు కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను.

చివరిగా నేను మీకు తెలిపే అత్యంత ముఖ్యమైన అంశం.

కృతఙ్ఞత కలిగి ఉండు

 భౌతికపరమైన విషయాలను చూసినప్పుడు మీరు ఎప్పటికీ సంతృప్తి చెందలేరు. మీరు మంచి వస్తువులుగాను కొనుగోలు చేయవచ్చు మరియు మీకు అందమైన ఆస్తులు ఉండి కూడా అవి మీకు పెద్దగా సంతృప్తిని ఇవ్వలేవని మీరు గ్రహిస్తారు. వస్తువులు విరిగిపోతాయి, అవి పాడైపోతాయి లేదా దొంగిలించబడతాయి.

 మీరు ప్రతిరోజూ  మీ చుట్టూ ఉన్న వ్యక్తుల విషయములో కావచ్చు, మీరు పొందే విజయాలు కావచ్చు లేదా మీరు పొందిన అనుభవం కావచ్చు, వీటి అన్నింటినీ సమయం తీసుకొని ఆలోచించి మీరు ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలో వ్రాయండి.

మీరు కలిగి ఉన్న అన్ని వస్తువులను కూడా చూడండి. మీకు ఇకపై అవసరం లేని వస్తువులను క్రమం తప్పకుండా వదిలించుకోండి. మీకు నిజంగా అవసరం లేని వస్తువులను కొనడం వాయిదా వేయండి, దీని వలన శాంతి మరియు సంతృప్తిని కూడా పొందవచ్చు.

మీ సహనాన్ని పెంచుకోండి

తక్షణ ఫలితాలను పొందడంపైన మనం ఎక్కువగా దృష్టి సారిస్తాం. అందువల్ల మనకు ఓపిక తగ్గుతోంది. కానీ జీవితంలోని అనేక అంశాలు సమయం తీసుకుంటాయి. అందువల్ల మీరు మీ కోసం విరామం  కూడా తీసుకోవడానికి కూడా ప్రయత్నించండి. లేదా మీ కుటుంబం మరియు స్నేహితులతో రోజువారీ రద్దీ నుండి కొంత వెసులుబాటు తీసుకోవడానికి ఇది మీకు బాగా సహాయపడుతుంది. ప్రకృతిలో నడిచి కొంత సమయం గడపండి. ఇది మీకు శాంతిని తెస్తుంది మరియు సహనం కలిగి ఉండడానికి మీకు సహాయపడుతుంది.

మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకండి

 అందరూ ఒకేలా ఉండరు, ప్రతి వ్యక్తికి వారి స్వంత ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకున్నప్పుడు, మీరు వారంత మంచివారు కాదనే అభిప్రాయం మీ మనస్సులో కలుగుతుంది.  మిమ్మల్ని మీరు ప్రతిసారీ ఇతరులతో పోల్చుకోవడం ద్వారా మీరు మీలో ఉన్న మంచి తనాన్ని గుర్తించడంలో తరచుగా విఫలమవుతారు, అంతేకాదు మీకు  మీరు అభద్రతా భావము కలిగి అసంతృప్తికి గురవుతారు.

మీరు మీలో ఉన్న మంచి విషయాల గురించి గర్వపడండి. మీకు తెలిసిన వ్యక్తుల కంటే మీలో మీకు మెరుగ్గా అనిపించే 5 విషయాలను గుర్తించి వ్రాయండి. లేదా మీలో ఉన్న ఉత్తమ లక్షణాలలో కొన్నింటినీ మీకు చెప్పమని మీరు బాగా విశ్వసించే మీ వారిని అడగండి.

 బంధాలను మరియు మీ స్నేహితులను పెంచుకోండి

అందరితోనూ స్నేహంగా ఉండాల్సిన అవసరం లేదు, మీకు భాగస్వామి ఉంటే మీ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని సమయాన్ని పెట్టుబడిగా  పెట్టండి మరియు ఆ సంబంధం ఎక్కువ కాలం కొనసాగితే, దానిలో  ప్రవేశించవచ్చు. ప్రతిసారీ ఏదో ఒక మంచి విషయంతో అవతలి వ్యక్తిని ఆశ్చర్యపరచండి. మీరు మీ భాగస్వామిని అభినందిస్తున్నారని మరియు గౌరవిస్తున్నారని వారు తెలుసుకునేటట్లు చేయండి.

మంచి స్నేహితుల కోసం అన్వేషించి కనుగొని  క్రమం తప్పకుండా వారితో సమయం గడపండి మరియు  ముఖ్యమైనవిగా వారు భావించే వాటిపైన కూడా ఆసక్తి చూపండి.

మీ భాగస్వామి మరియు మీ స్నేహితులు మీకు భిన్నంగా ఉన్నారని అంగీకరించండి. వారిలో ఉన్న మంచి లక్షణాలను గుర్తించి మెచ్చుకోండి, కానీ ఎవరూ పరిపూర్ణులు మాత్రం కాదని కూడా తెలుసుకోండి, మరియు ఈ విషయములో కూడా మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవద్దు. మీకు మీ స్వంత బలాలు ఉన్నాయి అని మరచిపోకండి.

పగ పెట్టుకోవద్దు

గతంలో తీసుకున్న కఠినమైన నిర్ణయాలు మీ జీవితాంతం మిమ్మల్ని వెంటాడతాయి. మీరు వాటిని విడిచిపెట్టలేకపోతే అవి మీ జీవితాంతం ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఇతర వ్యక్తులపై పగ లేదా ద్వేషం కలిగి ఉండకండి, మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించడానికి ప్రయత్నించండి, వారు పశ్చాత్తాపం చెందనప్పటికీ వారి మీద పగ పెట్టుకుంటే అది మిమ్మల్ని లోలోపల తినేస్తుంది.

నిజాయితీగా ఉండండి

మీరు ఇతరులతో నిజాయితీగా ఉండకపోతే  మీరు కొంత దాస్తున్నట్టే, అలా చేసినప్పుడు విలువైన స్నేహాలు కోల్పోయే అవకాశం ఉంది.  మీరు నిజాయితీగా ఉంటే మీరు వెనుతిరగాల్సిన అవసరం లేదు ఇది చాలా క్లిష్ట పరిస్థితులను నివారిస్తుంది. నిజం దాదాపు ఎప్పుడైనా బయటకు వస్తుంది.

వేరే విధానాన్ని ప్రయత్నించండి

మీరు చాలా సంవత్సరాలు ఒకే విధమైన పద్దతులలో  పనులు చేస్తూ స్థిరముగా కనసాగుతూ ఉన్నట్లయితే కొన్ని సార్లు దానిలో ఇరుక్కు పోయినట్లు అనిపించి, కొన్నిసార్లు ఆది భయం మరియు అనిశ్చితి భావాలను కలిగిస్తుంది, అది మీకు సంతృప్తికరమైన అనుభూతిని ఇవ్వకపోతే, ఒక అడుగు వెనక్కి వేసి దానిలో నుండి ఏమి మార్చవచ్చో చూడండి, మీరు పద్దతిని మార్చుకుంటే, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

జీవితం ఎల్లప్పుడూ సులభంగా ఉండదు, ఉదాహరణకు మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. ఈ పరిస్థితులను కొత్త అవకాశంగా పరిగణించడానికి ప్రయత్నించండి. గతంతో చిక్కుకుపోకండి, సృజనాత్మకమైన కొత్త అవకాశాల కోసం వెతకండి.

మీ జీవిత లక్ష్యం ఏమిటి?

మీ జీవితంతో నిజంగా సంతృప్తి చెందాలంటే, మీరు మీ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి. ఉద్దేశ్యమే లేకపోతే  మీకు ప్రయోజనం ఉండదు, మీ గమ్యం మీకు తెలియదు.

మీ జీవిత లక్ష్యాన్ని కనుగొనడానికి, మీరు దాని కోసం వెతకాలి. దాని కోసం సమయాన్ని వెచ్చించడం తప్పనిసరి. మీ ఉద్దేశ్యం మీకు తెలిసినప్పుడు, అది మీకు గొప్ప శాంతి మరియు సంతృప్తిని ఇస్తుంది.

మీరు మీ లక్ష్యాన్ని కనుగొంటారని నేను ఆశిస్తున్నాను. మీ కోసం నా కథనంలో మీ ఉద్దేశ్యాన్ని కనుగొనడంలో మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. మీకు ఆసక్తి ఉంటే, ఇంకా చదవండి!

.