అధ్యాయం 7 ~ ఆశ ఉన్నది

3వ అధ్యాయంలో సృష్టికర్త యొక్క అనేక లక్షణాలను మేము కనుగొన్నాము. దేవుడు సృజనాత్మక మరియు నమ్మదగిన సృష్టికర్త మాత్రమే కాదు. ఆయన ప్రేమను మరియు సంబంధబాందవ్యాలను కూడా సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు . ఆయన ప్రేమించకపోతే ప్రేమ అనేది ఈ ఉనికిలో ఉండదు.

ప్రేమకు కూడా వ్యతిరేకత ఉంది: అది ప్రేమ లేకపోవడమే . మీరు చీకటిలో మాత్రమే వెలుగును చూసిననట్లుగా . ప్రేమ లేకపోవడము, ద్వేషం మరియు స్వార్థం కూడా ఉన్నాయి.

దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచేలా మనలను చేసాడు

దేవుడు ప్రేమయై ఉన్నాడు మరియు ఆయన మనలను ప్రేమిస్తున్నాడు . దేవుడు తన ప్రేమను మనతో పంచుకోవాలని కోరుకుంటున్నాడు. శతాబ్దాలుగా మనం మొండితనం, అవిశ్వాసం మరియు తిరుగుబాటు తనం కలిగి యున్న వారమైనప్పటికి కూడా ఆయన మానవత్వంతో సహనంతో మనలను ప్రేమిస్తూనే ఉన్నాడు. మన మేలా ంటి ప్రవర్తన కలిగి ఉన్నవారమైనప్పటికి, ఆయన ఓపిక కలిగి మరియు తన ప్రేమకు అందరూ ప్రతిస్పందించే అవకాశాన్ని అందరికీ ఇవ్వాలని అను కుంటున్నాడు.

దేవుడు మనలను సృష్టించాడు, ఎందుకంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. దాసులుగా ఉండి ఆయనను సేవించడానికి సహాయకులు అవసరం అని కాదు. ఆయనకు అవి ఎందుకు అవసరం? ఆయన తన జీవులను ప్రేమిస్తాడు మరియు తన ప్రేమను మనతో పంచుకోవాలని కోరుకుంటాడు. మనం గ్రహించగలిగే దానికంటే ఎక్కువ.

కానీ మనం తిరుగుబాటుదారులం మరియు దేవుణ్ణి అవమానపరిచె వారము

మొదట, మీరు మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మీరు చీకటిలో జీవిస్తున్నారని మీకు తెలుసా? దేవుడు నిన్నుఆ విదముగా ప్రేమించలేడు, కాబట్టి ఆయన మీ తప్పులను పట్టించుకోలేడా? ఆయనకి పరువు పోయిందని, మన కార్యాలు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. మనం తప్పు చేసినప్పుడల్లా భగవంతుని ప్రేమకు మనకు మధ్య దూరం పెరుగుతుంది.

కానీ ఆశ ఉంది! తాము తప్పు చేశామని గ్రహించి, తమ తప్పులకు పశ్చాత్తాపపడే వారిని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.

మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.౹ మనము పాపము చేయలేదని చెప్పుకొనినయెడల, ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము; మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. 1 యోహాను 1:9-10

దేవుడు మనతో సంబంధాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్నాడు. కానీ ఆయన మనల్ని బలవంతం చేయడు. ఆయన ప్రేమను పొందాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇవ్వడానికి అయన సిద్ధంగా ఉన్నాడు.

మీరు చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందడం ద్వారానో మరియు మంచి పనులు చేయడం ద్వారానో మీరు దేవుని ప్రేమను ఎప్పటికీ పొందలేరని,మీరు దానిని భర్తీ చేయలేరని. మీరు గ్రహించాలి. దేవుడు ప్రేమగలవాడు మాత్రమే కాదు, న్యాయవంతుడు కూడా కాబట్టి ఆయన అలా క్షమించలేడని మనం చూశాము.

మీ చెడ్డ పనులకు పశ్చాత్తాపపడటం మరియు ఆయన పట్ల మీకు గౌరవం లేకపోవడం సరిపోదు. మీరు ఇతరులకు హాని కలిగించిన మీ చెడు పనులతో మరియు మీ చెడు ప్రవర్తనతో మీరు మీ సృష్టికర్తను బాధపెట్టి మరియు అగౌరవపరిచినందుకు ఏదైనా చేయవలసి ఉంటుంది. దేవుడు కోరుకున్న విధంగా మనం ఒక్క రోజు కాదు ఎప్పటికీ జీవించలేము అనే వాస్తవంతో ఏదో ఒకటి చేయవలసి ఉంటుంది, ఆయన మన తప్పులను శిక్షించకుండా విడిచిపెట్టలేడని మనం చూశాము. అది ఆయనను అన్యాయంగా మరియు నమ్మదగనిదిగా చేస్తుంది.

మీరు మీ తిరుగుబాటు ప్రవర్తన కారణంగా, మీరు దేవుని ముందు కనిపించలేరు. మీరు దేవునికి దూరమై అనాథలా అవుతారు. మీరు దీన్ని శూన్యం మరియు అర్ధంలేని జీవితంగా అనుభవించవచ్చు. మీరు మీ సృష్టికర్తతో సంబందం కోల్పోతున్నారు.

కానీ అంతిమంగా, దేవుడు కోరుకునేది అది కాదు.

blank

దేవుని అద్భుతమైన పరిష్కారం

దేవుడు అనే సహాయము లేకుండా లక్ష్యం లేని జీవితాన్ని గడుపుతారు, అది మరణంతో ముగుస్తుంది. ఆయన ఉద్దేశించినట్లుగా మీరు ఎప్పటికీ పరిపూర్ణ జీవితాన్ని గడపలేరని దేవునికి తెలుసు. ఆయన మనిషిని సృష్టించక ముందే, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన తన గౌరవాన్ని పునరుద్ధరించడానికి మీ అపరాధం మరియు అవమానం నుండి మిమ్మల్ని విడిపించడానికి ప్రణాళికా చేశాడు. క్షమించడం లేదా దయ చూపించడం సాధారణ విషయమేమి కాదు. అది అన్యాయం మరియు ఆయన గౌరవాన్ని అణగదొక్కింది. ఆయన అపరిమితమైన ప్రేమ ను చూపించడానికి ప్రణాళికా చేశాడు.

నీ మీదికి రావాలిసిన శిక్ష దేవుడే తీసుకున్నాడు! ఆయన మీ రుణాన్ని చెల్లించాడు మరియు ఆయన న్యాయం, గౌరవం మరియు విశ్వసనీయతను రాజీ పడకుండా క్షమించగలడు.

మీరు ఈ అద్భుతమైన ప్రణాళికా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

.

సారాంశం