అధ్యాయం 3 ~ జీవిత రూపకర్త

ఈ అన్వేషణలో మీరు నాతో చేరాలని నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మనము కలిసి జీవితంలోని అత్యంత ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను కనుగొనడానికి ప్రయత్నిస్తాము. మీరు ఎన్నడూ ఆలోచించని ప్రశ్నల గురించి మనము ఆలోచిస్తాము.

ఒక రూపకర్త, జీవిత సృష్టికర్తఅయి ఉంటే, అది ఎవరో అందరికీ ఎందుకు తెలియదు? మన సృష్టికర్తను మనం చూడగలిగితే మీరు దీన్ని చాలా సులభంగా కనుగొనలేరా? మన ప్రశ్నలకు చాలా సులభమైన సమాధానం ఉంటుంది. అయితే సృష్టికర్త తనను తాను బహిరంగంగా చూపించకపోవడానికి తగిన కారణం ఉండాలి.

అయినప్పటికీ, ప్రకృతిని మరియు మానవులను చూడటం ద్వారా సృష్టికర్త యొక్క అనేక లక్షణాలను కనుగొనడం సాధ్యమవుతుంది. ఒక రూపం(డిజైన్) కూడా రూపకర్త (డిజైనర్) గురించి కొంత చూపుతుంది. మీరు ప్రకృతిని మరియు విశ్వాన్ని చూస్తే రూపకర్త(డిజైనర్) గురించి మీరు ఏమి కనుగొనగలరు? ఈ అధ్యాయంలో నేను ప్రకృతిలో కనిపించే రూపకర్త (డిజైనర్) యొక్క అనేక లక్షణాలను మీకు చూపించాలనుకుంటున్నాను.

ఒక సృజనాత్మక రూపకర్త (డిజైనర్)

భూమిపైన జీవితం రూపకర్త యొక్క సృజనాత్మకత ను రుజువు చేస్తుంది. ప్రకృతిలోని అన్నింటిని చూడండి. ప్రతిదీ అపారమైన శ్రద్ధతో తయారు చేయబడిందని మీరు చూడవచ్చు. ప్రతి మొక్క, జంతువు మరియు మానవుడు ఇవన్నీ చాలా క్లిష్టంగా ఉంటాయి, శతాబ్దాల పరిశోధన తర్వాత కూడా, శాస్త్రవేత్తలు ఇంకా చాలా కనుగొనవలసి ఉంది. మరి మిగిలిన విశ్వం గురించి ఏమిటి? లెక్కలేనన్ని నక్షత్రాలు మరియు గ్రహాలు ఉన్నాయి, ఇంకా కనుగొనవలసినవి చాలా ఎక్కువే ఉన్నాయి .

blank

నేను మీ కోసం ఈ కథ రాయడం ప్రారంభించినప్పుడు నేను తోటలో ఉన్నానని మీకు గుర్తుందా, మరియు ప్రకృతిలో ఉన్న అందం మరియు వివరాలను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఏ రెండు జీవులు ఒకేలా ఉండవు మరియు ప్రకృతిలోని ప్రతి భాగం కంటికి అందంగా ఉంటుంది. కానీ ప్రకృతి కేవలం అందమైనదే కాదు, మానవులు, జంతువులు మరియు మొక్కల యొక్క ప్రతి లక్షణం కూడా వాటి వాటి విధిని కలిగి ఉంటాయి. అన్ని కలిసి పని చేస్తాయి .

కీటకాలు లేకుండా పువ్వు పునరుత్పత్తి చేయదు మరియు పువ్వులు లేకుండా కీటకాలు జీవించలేవు. చాలా పువ్వులు అందమైన రంగులను కలిగి ఉంటాయి, అవి కీటకాలను ఆకర్షిస్తాయి. కొన్ని పువ్వుల రూపం తమ పుప్పొడిని మరొక పువ్వుకు తీసుకెళ్లగల కీటకాలకు ఆకర్షణీయంగా ఉంటుంది.

తేనెటీగలు మరియు ఇతర కీటకాలు మనం తినే అనేక మొక్కలను పరాగసంపర్కం చేస్తాయి. ఈ తేనెటీగలు లేకుండా మనకు ఆహారం లేదు. మరియు నా ఉద్దేశ్యం కేవలం తేనె అనేకాదు. మనం తినే చాలా మొక్కలు తేనెటీగల ద్వారా జరిగే పరాగసంపర్కంపై ఆధారపడి ఉంటాయి. ఈ చిన్న, బొచ్చుతో కూడిన కీటకాలు లేకుండా మన జీవితాలు చాలా భిన్నంగా ఉంటాయి.

జీవితాన్ని సాధ్యం చేయడానికి ప్రతిదీ ఎలా కలిసి పనిచేస్తుందో చూపించే లెక్కలేనన్ని ఉదాహరణలలో ఇది ఒకటి మాత్రమే. ఇవన్నీ ఈ విధముగా ముందుకు రావాలంటే దీని సృష్టికర్త అపురూపమైన సృజనాత్మకత మరియు తెలివైన వాడై ఉండాలి.

నమ్మదగిన సృష్టికర్త

ప్రతి రాత్రి మనం పడుకునేటప్పుడు, కొన్ని గంటల్లో సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడని మేము భావిస్తున్నాము. ఎప్పుడు చీకటిగానె ఉంటుందని మనము భయపడము. ఋతువులు వాటి వాటి కాలములో వచ్చి పోతాయని కూడా మనకు తెలుసు. శరదృతువులలో శీతాకాలం వస్తుందని మరియు వసంతకాలం వస్తుందని మనకు తెలుసు. ప్రతి సంవత్సరం విత్తడానికి ఒక కాలం మరియు కోతకు ఒక కాలం ఉంటుంది.

మనం పగలు మరియు రాత్రి మరియు వేసవి మరియు శీతాకాలపు ఈ సాధారణ నమూనాలను విశ్వసిస్తాము. గురుత్వాకర్షణ వంటి ప్రకృతి నియమాలపై కూడా మనం ఆధారపడవచ్చు. ఈ నియమాలు మారవు. స్థిరమైన ప్రకృతి నియమాలు లేకపోతే సైన్స్ ఉనికిలో ఉండదు.

ప్రకృతిలో ప్రతిదీ స్థిర నమూనాల ప్రకారం కారణం మరియు ప్రభావంతో పనిచేస్తాయి. యాదృచ్ఛికంగా ఏమీ జరగదు. రోజు అనేది ఎల్లప్పుడూ 24 గంటల నిడివితో ఉంటుంది,ఒకప్పుడూ ఎక్కువ ఒకప్పుడు తక్కువ గంటలు తో ఉండదు. మీరు ఏదైన ఎత్తులోనుండి దూకినప్పుడు గురుత్వాకర్షణ ఎల్లప్పుడూ మిమ్మల్ని క్రిందికి లాగుతుంది, ఆది ఎప్పుడూ పైకి లేపదు.

ప్రకృతి నియమాలు ఖచ్చితముగా ఏకపక్షంగా ఉంటే, మనమే గందరగోళానికి గురవుతాము. భూమిపై జీవితం అసాధ్యం మరియు విశ్వం ఉనికిలో ఉండదు.

సృష్టికర్త క్రమం మరియు నిర్మాణం కర్త అయి, ప్రభావం కలిగిన సృష్టికర్త. కాబట్టి, సృష్టికర్త నమ్మదగినవాడని చెప్పడం సురక్షితం.

blank

ఆయనే ప్రేమ మరియు సంబంధభాంధవ్యాల సృష్టికర్త

మన చుట్టూ ఉన్న వ్యక్తులు లేకుండా మనం జీవించలేము. ప్రతిదీ పూర్తి చేయడానికి ఒకరికి మరొకరు అవసరం. మనకు ఇతర వ్యక్తులతో సంబంధాలు కూడా అవసరం. మన కుటుంబం మరియు ప్రియమైనవారితో బంధం అనేది ఆహారం మరియు పానీయాల కంటె ఒకరినొకరు అవసరం లోతుగా ఉంటుంది. మన ఉనికిలో మనుషుల మధ్య సంబంధాలు మరియు ప్రేమ ఒక ప్రత్యేక భాగం. అవి జీవితానికి అదనపు రుచిని అందిస్తాయి. కాబట్టి ప్రజల మధ్య ప్రేమ మరియు సంబంధాల కోసం సృష్టికర్తకు ఒక ఉద్దేశ్యం ఉండాలి. మనము దీని గురించి కొంచెం లోతుగా వెళదాము.

సత్యానికి మరియు అసత్యానికి ఆధారం

సృష్టికర్త ఇప్పటికీ తన సృష్టిలో పాలుపంచుకున్నాడని మీరు అనుకుంటున్నారా? లేదా ఆయన విశ్వాన్ని సృష్టించాడు మరియు మనల్ని విడిచిపెట్టాడని మీరు అనుకుంటున్నారా? ఈ ప్రపంచంలోని అన్ని కష్టాలను మీరు చూస్తే, ఇది అస్సలు వింత ప్రశ్న కాదు.

సృష్టికర్త లేకుండానే ప్రపంచం ఆవిర్భవించిందని అనుకుంటే . అలాంటప్పుడు, ప్రపంచంలో ఎందుకు దుఃఖం ఉంది అనే ప్రశ్నకు సమాధానం ఏమిటి? లేదా కారణం లేకుండానే దుస్థితి ఉందని మీరు అనుకుంటున్నారా? కానీ ఏదో సరైనది లేదా తప్పు అనేవి ఎందుకు? దానిని ఎవరు నిర్ణయిస్తారు? ఎక్కడో సాధారణ ప్రమాణం,అది నైతిక సత్యమై ఉండాలి.

ఒక వ్యక్తి ‘చెడు’ నుండి ఎందుకు రక్షించబడాలి? ఏది తప్పో ఏది ఒప్పో ప్రకృతి నియమాలు నిర్ణయించవు. అవి ప్రకృతి నియమాలె తప్ప మరేమీ కాదు. అవి ఎప్పుడూ ఏమి చేస్తాయి. మీరు దూకినప్పుడు, గురుత్వాకర్షణ మిమ్మల్ని క్రిందకు లాగుతుందని మీకు తెలుసు. అందులో మంచి చెడు ఏమీ లేదు.

ప్రతిదీ కారణం మరియు ప్రభావం కంటే ఎక్కువ కాదని అనుకుందాం. దానితో ఎంపిక చేసుకోవడం సాధ్యమవుతుందా? మనం చేసేదంతా కేవలం భౌతిక మరియు రసాయన ప్రక్రియల ఫలితమే అని మీరు అనుకుంటే, ప్రపంచంలోని దుస్థితి గురించి చింతించాల్సిన అవసరం లేదు. మనం చేసే పనులకు బాధ్యతగా భావించాల్సిన అవసరం లేదు. మన చర్యలు మన మెదడు మరియు శరీరంలో రసాయన ప్రక్రియల ఫలితంగా మాత్రమే ఉంటాయి. లేదా వాటిని చూసేందుకు వేరే మార్గం ఉందా?

నిష్పాక్షికమైన ‘సరైన’ లేదా ‘తప్పు’ ఉనికిలో లేకుంటే, హత్య, అత్యాచారం, వ్యభిచారం లేదా అబద్ధం తప్పు అని ఎందుకు చెబుతాము? ఒక సంపూర్ణ సత్యం ఉండాలి. ఆ సత్యం సృష్టిలో లోతుగా పాతుకుపోయింది మరియు అది సృష్టికర్త నుండి వస్తుంది.

సృష్టికర్త మనల్ని ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్నకు సమాధానం తెలుసు కోసం మీరు కూడా ఆసక్తిగా ఉన్నారా?

blank

.

సారాంశం