అధ్యాయం 1 ~ మీ జీవితం ఎందుకు ముఖ్యమైనది

ఒక అందమైన వసంతం రోజున నేను మీ కోసం ఈ కథను వ్రాయడం ప్రారంబించాను. నేను మా తోటలో ఉన్నాను, చుట్టూ పూర్తిగా వికసించిన పువ్వులు మరియు సీతాకోకచిలుకలు ఒక పువ్వు నుండి మరొక పువ్వుకు ఎగురుతాయి. వాటిలో ఒకటి పెద్ద పసుపు పువ్వు మీద వ్రాలి తేనెను తింటుంది. నేను జాగ్రత్తగా దాని వైపు నడుస్తూ సీతాకోకచిలుకను దగ్గరగా చూస్తున్నాను. అందమైన ఆకారం మరియు దాని రంగులు చూసి నేను ఆశ్చర్యపోయాను. తరవాత అది దాని శరీరంపై పుప్పొడి యొక్క మందపాటి పొరతో ఎగిరిపోతుంది. దాని ప్రయాణం మరో పువ్వు వైపు సాగుతుంది.

blank

మీకు తెలుసా భూగ్రహం మీద దాదాపు 400,000 రకాల పువ్వులు మరియు మొక్కలు ఉన్నాయని? మీరు ఊహించగలరా? నేను చూసే ప్రతిసారీ అన్ని పువ్వుల మధ్య ఉన్న బేధాలు నన్ను ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి పువ్వుకు అందమైన రంగు మరియు ప్రత్యేకమైన ఆకారం కలిగి ఉంటాయి.

అన్ని తేడాలు నన్ను ఆశ్చర్యపరిచాయి కాబట్టే, నేను ప్రకృతిని గూర్చి అధ్యయనం చేయడం ప్రారంభించాను. ఆ తేడాలు అద్భుతమైనవె, కానీ మొక్కలు, జంతువులు మరియు మానవులను జీవించేలా చేసేవి మరింత అద్భుతమైనవి.

మన శరీరము ఒక అద్బుతమైనది

మీరు ఎప్పుడైనా “డూ-ఇట్-యువర్ సెల్ఫ్” అనే కిట్ కొనుగోలు చేసారా? ఉదాహరణ కుఆది ఒక బుక్‌కేస్. కిట్‌లో చాలా అల్మారాలు, స్క్రూలు మరియు మాన్యువల్ ఉన్నాయి. మీ శరీరం కూడా కొంచెం అలాంటిదే. ఇది బిలియన్ల కణాలను కలిగి ఉండి, ప్రతి కణం మీ మొత్తం శరీరానికి సంబంధించిన నియమ సంపుటిని కలిగి ఉంటుంది. ఈ నియమసంపుటిని DNA అంటారు – మీ శరీరం యొక్క రూపురేఖలు. మీ DNA నే మిమ్మల్ని మీరు కనిపించే విధంగా చేస్తుంది.

మీ జీవితం ప్రారంభమైనప్పుడే కణంలో కూడా ఈ పూర్తి దాని నమూనా అప్పటికే ఉంది. మీ DNA మీ శరీరం ఎలా నిర్మితమైందో – ఆది తల, చేతులు, కాళ్లు, మీ కంటి రంగు మరియు మీ ముక్కు ఆకారంను నిర్దేశిస్తుంది కానీ ఇది మీ అవయవాలు మరియు అవి ఎలా కలిసి పని చేస్తాయో కూడా నిర్ణయిస్తుంది. అది అద్భుతం కాదా?

blank

కాబట్టి DNA మీ శరీరం యొక్క నియమ సంపుటి ఇది కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కోడ్ లాంటిది. మీ కంప్యూటర్ సరిగ్గా పనిచేయడానికి ఈ కోడ్ అవసరం. ఇది మీ కంప్యూటర్‌లో ఇంటర్నెట్‌ను సర్ఫ్ చేయడం లేదా లేఖ రాయడం సాధ్యం చేస్తుంది.

మానవ శరీరములో ఉన్న డి ఎన్ ఏ గూర్చి పరిశోధకుల పరిశీలనలో తేలిన విషయాలన్నింటి గూర్చి వ్రాయ లంటే (1) మిలియన్ పేజీలు కలిగిన పుస్తకము కూడా సరిపోదు పెద్ద పరిమాణం అంటే 2,500 కంటే ఎక్కువ . ఈ కోడ్ మీ శరీరములో ఉన్న ప్రతి కణములో దాగి ఉన్నది .

జీవితం అనుకోకుండా ప్రారంభమైందా?

చాలా మంది శాస్త్రవేత్తలు భూమిపై జీవితం అనుకోకుండా ప్రారంభమైందని నమ్ముతారు. రసాయన ప్రక్రియల వల్ల మరియు దశల వారీగా ఏర్పడింది లేక సంభవించిందని వారు భావిస్తున్నారు. కానీ ఎక్కువ మంది శాస్త్రవేత్తలు DNA చాలా సంక్లిష్టమైనదని గ్రహించారు, అది అనుకోని రీతిలో రసాయన ప్రతిచర్యల శ్రేణి నుండి ఉద్భవించలేదు.

కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ గురించి మరోసారి ఆలోచిద్దాం. మీరు కంప్యూటర్ ప్రోగ్రామర్ వంటివారు కాకపోవచ్చు, కాబట్టి ఒక మానవ కణంలోని DNA Windows కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ వలె సంక్లిష్టంగా ఉంటుందని మీకు బహుశా తెలియకపోవచ్చు. విండోస్ వంటి సంక్లిష్టమైన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లు యాదృచ్ఛికంగా వచ్చినట్లు మీరు భావిస్తున్నారా? ఈ ప్రోగ్రామ్ మానవ డి ఎన్ ఏ వంటి అనేక సూచనలను కలిగి ఉంటుంది (3) విండోస్ అనేవి వేల కొలది కార్యప్రణాళికల ద్వారా సంవత్సరాలు సంవత్సరాలు గా అవి ఏర్పడినది.

డిజైన్ లేకుండా కోడ్ లేదు. డిజైన్ లేకుండా మరియు ప్రోగ్రామర్లు పని చేయకుండా, అనుకోకుండా ఏ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ ఆవిర్భవించలేదు. మన DNA కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ లాగా సంక్లిష్టంగా ఉంటే, మనుషులు అనుకోకుండా ఆవిర్భవించి ఉండేవారా?

blank

.

[1] Human genome height (English)

[2] National Geographic – How Many Cells in Your Body (English)

[3] Lines of Code in Windows 10 , Souce code length (English)

.

సారాంశం